చైతు మూవీలో వెంకీ..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మేన‌ల్లుడు చైతు తో మేన‌మామ వెంకీ న‌టిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల చైతు, వెంకీ పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం.
చైతు కాలేజ్ స్టూడెంట్. అల్ల‌రి కాస్త ఎక్కువైంద‌ని ప్రిన్సిప‌ల్ చైతు మేన‌మామ‌కి క‌బురు పంపితే వెంకీ వ‌స్తాడ‌ట‌. వెంకీ... చైతుకి క్లాస్ తీసుకుంటాడ‌నుకుంటే...పిల్ల‌ల‌న్నాకా అల్ల‌రి చేయ‌రా అంటూ ప్రిన్సిప‌ల్ కి క్లాస్ తీసుకుంటాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా...కావాలంటే నీ ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంటికి వ‌చ్చేయ్ రా నీకు కావ‌ల్సినంత ఫ్రీడ‌మ్ అని చైతు తో వెంకీ అంటాడ‌ట‌. ఇక ఈ సీన్స్ థియేట‌ర్ లో చూస్తే...విజిల్సే విజిల్స్. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ప్రేమ‌మ్ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.