వెంక‌టేష్‌... హార్స్ రేస్‌

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

వెంక‌టేష్‌కి ఫేవ‌రేట్ ఆట క్రికెట్‌. మ‌రి హార్స్ రేస్ ఏంటి? ఆయ‌న‌కు హార్స్ రేస్ అంటేనూ ఇష్ట‌మా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఆయ‌న‌కు హార్స్ రేస్‌లో ఇప్ప‌టిదాకా ప్ర‌వేశం ఉన్నా, లేకున్నా ఆయ‌న ఇక‌మీద‌ట అందులో నైపుణ్యాన్ని తెచ్చుకోనున్నారు. ఎందుకంటే ఆయ‌న ఆ నేప‌థ్యంలో సినిమా చేయ‌బోతున్నారు కాబ‌ట్టి.

వెంక‌టేష్ హీరోగా సురేష్ ప్రొడక్ష‌న్స్ ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది క‌లిసి నాలుగు సినిమాల‌ను నిర్మించ‌నుంది. అందులో ఒక‌టి ఇప్ప‌టికే సెట్స్ మీద ఉన్న 'వెంకీ మామ‌'. ఈ సినిమా త‌ర్వాత మ‌రో మూడు సినిమాలు వ‌రుస‌గా సెట్స్ మీదకు వెళ్తాయి. అందులో ఒక‌దానికి 'పెళ్లిచూపులు' ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 'పెళ్లిచూపులు' త‌ర్వాత ఆయ‌న వెంక‌టేష్‌కు కాన్సెప్ట్ చెప్పార‌ట‌.

అప్ప‌టి నుంచీ దాని మీద వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వ‌చ్చింద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం స్పోర్ట్స్ డ్రామాగా త‌రుణ్ క‌థ‌ను తీర్చిదిద్దారట‌. వెంక‌టేష్ కూడా ఓకే చెప్ప‌డంతో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుందని స‌మాచారం. వెంక‌టేష్ ఇంత‌కు పూర్వం న‌టించిన 'గురు' స్పోర్ట్స్ డ్రామా కావ‌డం గ‌మ‌నార్హం.