ఈ ఏడాది వెంకీ సినిమా లేనట్టే..
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్ సినీ ప్రస్థానానికి ఈ ఏడాదితో 32 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ ప్రస్థానంలో 2011 మినహాయిస్తే.. ప్రతి ఏడాది కూడా ఒకటి లేదా అంతకుమించి సినిమాలతో ఆయన సందడి చేస్తూనే ఉన్నారు. అయితే.. 2011 తరువాత ఈ ఏడాదిలో కూడా హీరోగా వెంకీ నుంచి సినిమా లేనట్టే కనిపిస్తోంది.
సంక్రాంతికి విడుదలైన 'అజ్ఞాతవాసి'లో వెంకీ అతిథి పాత్రలో కనిపించినా.. సినిమా విడుదలైన కొద్ది రోజుల తరువాత మాత్రమే ఆ సీన్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం వెంకీ 'ఎఫ్ 2', 'వెంకీ మామ' (ప్రచారంలో ఉన్న పేరు) అనే మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నారు. ఎఫ్ 2 సంక్రాంతికి విడుదల కానుందని చిత్ర బృందం ప్రారంభోత్సవంలో చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో.. ఇంకా ప్రారంభోత్సవం కూడా జరుపుకోని వెంకీ మామ' ఈ ఏడాదిలో వస్తుందనుకోలేం. అంటే.. ఈ ఏడాదిలో వెంకీ హీరోగా సినిమా లేనట్టే. ఆయన అభిమానులకు ఇది నిరాశపరిచే విషయమనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments