ఈ ఏడాది వెంకీ సినిమా లేనట్టే..

  • IndiaGlitz, [Monday,June 25 2018]

క‌థానాయ‌కుడిగా విక్ట‌రీ వెంక‌టేష్ సినీ ప్ర‌స్థానానికి ఈ ఏడాదితో 32 ఏళ్ళు పూర్త‌వుతోంది. ఈ ప్ర‌స్థానంలో 2011 మిన‌హాయిస్తే.. ప్ర‌తి ఏడాది కూడా ఒక‌టి లేదా అంత‌కుమించి సినిమాల‌తో ఆయ‌న సంద‌డి చేస్తూనే ఉన్నారు. అయితే.. 2011 త‌రువాత ఈ ఏడాదిలో కూడా హీరోగా వెంకీ నుంచి సినిమా లేన‌ట్టే క‌నిపిస్తోంది.

సంక్రాంతికి విడుద‌లైన 'అజ్ఞాత‌వాసి'లో వెంకీ అతిథి పాత్ర‌లో క‌నిపించినా.. సినిమా విడుద‌లైన కొద్ది రోజుల త‌రువాత మాత్ర‌మే ఆ సీన్‌ను యాడ్ చేశారు. ప్ర‌స్తుతం వెంకీ 'ఎఫ్ 2', 'వెంకీ మామ' (ప్ర‌చారంలో ఉన్న పేరు) అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేస్తున్నారు. ఎఫ్ 2 సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని చిత్ర బృందం ప్రారంభోత్స‌వంలో చెప్పుకొచ్చింది.

ఈ నేప‌థ్యంలో.. ఇంకా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకోని వెంకీ మామ' ఈ ఏడాదిలో వ‌స్తుంద‌నుకోలేం. అంటే.. ఈ ఏడాదిలో వెంకీ హీరోగా సినిమా లేన‌ట్టే. ఆయ‌న అభిమానుల‌కు ఇది నిరాశ‌ప‌రిచే విష‌య‌మ‌నే చెప్పాలి.

More News

కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న నిర్మాత‌

తెలుగు తెర‌ పై మ‌రో ప్ర‌ముఖ నిర్మాత త‌న‌యుడు క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించ‌నున్నారు. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు.. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న డి.వి.వి.దాన‌య్య‌.

ర‌జ‌నీకాంత్ కోసం బాలు పాట‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు సినిమాల కోసం గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం గాత్రం అందించారు.

మ‌హేష్ రూమ్ మేట్‌గా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శకుడితో నాగ‌శౌర్య వ‌రుస చిత్రాలు

''చూసి చూడంగానే న‌చ్చేశావే.. అడిగి అడంగానే వ‌చ్చేశావే.. నా గుండెల్లోకి..'' అంటూ సాగే 'ఛ‌లో' చిత్రంలోని పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వ‌రుణ్ తేజ్‌కిదే తొలిసారి..

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను చెప్పుకోవచ్చు.