గురు...వెంకీ టీజర్ లో సర్ ఫ్రైజ్ అదిరింది..!
Tuesday, December 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురు టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో సర్ ఫ్రైజ్ ఉంది. అది ఏమిటంటే....జింగిరి జింగిరి అంటూ వెంకీ పాట పాడేసాడు. ఫస్ట్ టైమ్ వెంకీ పాట పాడడం విశేషం. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ లో వలే తెలుగులో కూడా గురు ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తూ...హ్యాపీ బర్త్ డే & ఆల్ ది బెస్ట్ టు వెంకీ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments