వెంకటేష్ గురు షూటింగ్ పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వచ్చేవారం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రితికా సింగ్ & ముంతాజ్ ఓరిజినల్ మూవీలో నటించిన పాత్రలనే ఈ చిత్రంలో కూడా పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com