'గురు' శాటిలైట్ హక్కులు....

  • IndiaGlitz, [Wednesday,December 28 2016]

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో గురు సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాలాఖ‌ద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో పెద్ద స‌క్సెస్ అయిన చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తుంది.

సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు స్పీడు అందుకున్నాయి. ఇప్పుడు రిప‌బ్లిక్ డే జ‌న‌వ‌రి 26న సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా విడుద‌ల‌కు ముందే శాటిలైట్ హ‌క్కుల‌ను జెమిని టీవీ చేజిక్కించుకుంది. దాదాపు ఐదు కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు టాక్ విన‌ప‌డుతుంది.