అనిల్ చిత్రాన్నే వెంకీ పట్టాలెక్కించనున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'గురు' చిత్రం విడుదలై ఏడాదికి పైనే అవుతోంది. మధ్యలో 'అజ్ఞాతవాసి' సినిమాలో కనిపించినా.. అది అతిథి పాత్రే. ఈ నేపథ్యంలో.. వెంకీ హీరోగా నటించే సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్ట్స్ కోసం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఏదీ కూడా సకాలంలో సెట్స్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తేజ, అనిల్ రావిపూడి, బాబీ.. ఇలా ఈ ఐదుగురి దర్శకులతో వెంకీ తదుపరి చిత్రాలు ఉండబోతున్నట్లు అధికారికంగా వార్తలు వచ్చాయి. ఈ పాటికే మొదలవ్వాల్సిన తేజ కాంబినేషన్ మూవీ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.
అయితే.. తేజ డైరెక్షన్లో ఆగిపోయిందనుకున్న ‘ఆటా నాదే వేటా నాదే’ చిత్రం మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. మే నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే ఎన్టీఆర్ బయోపిక్ కోసం తేజ ఎక్కువ కాల్షీట్స్ కేటాయించనున్నారు. ఈ కారణంగా వెంకీ, తేజ సినిమా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నందున వెంకీ చిత్రం దసరా తరువాతే మొదలు కావచ్చని వినిపిస్తోంది. అలాగే.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెంకీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. స్క్రిప్ట్‌తో పాటు.. టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించుకుని ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేసారు అనిల్. ఇక బాబీ చిత్రం మొదలు కావాలంటే.. నాగచైతన్యకున్న కమిట్మెంట్స్ పూర్తవ్యాలి. ఈ నేపథ్యంలో.. అనిల్ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళ్ళవచ్చని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com