20 ఏళ్ళ 'గణేష్'
Send us your feedback to audioarticles@vaarta.com
నంది పురస్కారాలకు చిరునామాలా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. 'ఉత్తమ నటుడు'గా ఆయనకు నందిని అందించిన చిత్రాలలో 'గణేష్' ఒకటి. వైద్య రంగంలోని లోపాలను సూటిగా ప్రశ్నిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
తిరుపతి స్వామి రూపొందించిన ఈ సినిమాలో రంభ, మధుబాల కథానాయికలుగా నటించగా.. కోట శ్రీనివాసరావు, చంద్ర మోహన్, రేవతి, కీర్తన, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించారు. 1998కిగానూ 'తృతీయ ఉత్తమ చిత్రం'గా నంది అవార్డును అందుకోగా.. ఇందులో విలన్‌గా నటించిన కోట శ్రీనివాసరావు 'ఉత్తమ ప్రతినాయకుడు'గా పురస్కారాన్ని అందుకున్నారు. జూన్ 19, 1998న విడుదలైన ఈ సినిమా నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout