తారక్ ట్వీట్‌కు వెంకీ ఫన్నీ రీ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండ్ అవుతోన్న ఛాలెంజ్ ‘బీ ద రియల్ మేన్’. క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లోని మహిళలకు చేదోడు వాదోడుగా ఉండాలని సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్‌లో ముందు రాజమౌళి తర్వాత తారక్, చరణ్, కీరవాణి, కొరటాల శివ, సుకమార్ తదితరులు పాల్గొన్నారు. వీరు మరి కొందరిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నామినేట్ చేసిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లలో చిరంజీవి ముందుగా ఛాలెంజ్‌కు ఓకే చెప్పారు. ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. ‘‘తారక్ నేను ఛాలెంజ్‌కు నేను సిద్ధం. కానీ ముందు మా గ్యాంగ్ లీడర్ చిరంజీవిగారి వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.
వెంకటేశ్ చిరంజీవిని తమ గ్యాంగ్ లీడర్ అని సంబోధిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనా ప్రభావం కారణంగా సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారికి నచ్చిన పనులను చేస్తున్నారు. ఈ తరుణంలో బీ ద రియల్‌మేన్ ఛాలెంజ్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. స్టార్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొంటుండటంతో అందరూ ఆసక్తిగా ఈ ఛాలెంజ్ కోసం ఎదురుచూస్తున్నారు. క్రమంగా ఈ ఛాలెంజ్‌లో మరికొంత మంది స్టార్స్ చేరుతున్నారు. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే ఆయన కరోనా వైరస్ సమయంలో క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించి సంఘీభావాన్ని తెలియజేసే కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
Challenge accepted @tarak9999... ?????? I’m waiting for our GANG LEADER @KChiruTweets’s video... ?? #BeTheRealMan https://t.co/vKRWGKiAQH pic.twitter.com/b4tSm8eFRF
— Venkatesh Daggubati (@VenkyMama) April 22, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments