'కావలై వేండాం' (ఎంతవరకు ఈ ప్రేమ) బ్లాక్ బస్టర్ హిట్ - డి.వెంకటేష్
- IndiaGlitz, [Friday,November 25 2016]
తెలుగు వెర్షన్ రిలీజ్‌కి తగినంత సమయం ఇవ్వకుండా హ్యాండిచ్చినా... తమిళ వెర్షన్ 'కావలై వేండాం' బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందర్లోనే తెలుగులో 'ఎంతవరకు ఈ ప్రేమ' పేరుతో రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు నిర్మాత, డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్. జీవా- కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం' నిన్న(గురువారం) రిలీజై తమిళనాట సంచలన విజయం సాధించింది.
ఈ సందర్భంగా .....
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- ''కావలై వేండం యువతరం మెచ్చే అద్భుతమైన ప్రేమకథా చిత్రం, లవ్ ఎంటర్‌టైనర్ అంటూ తమిళ సమీక్షకులు ఆకాశానికెత్తేశారు. రేటింగులతో సినిమా విజయాన్ని డిక్లేర్ చేశారు. అలాంటి క్రేజీ మూవీని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' పేరుతో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి 'యామిరుక్క బయమేన్' ఫేమ్ డీకే దర్శకత్వం వహించారు. సైమల్టేనియస్ రిలీజ్ సాధ్యపడకపోయినా తమిళ వెర్షన్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం తెలుగు వెర్షన్ 'ఎంతవరకు ఈ ప్రేమ' సక్సెస్‌కి దోహదపడుతుంది.'' అన్నారు.
మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుతూ - ''ఈ సినిమాతో జీవా ఈజ్ బ్యాక్ ఎగైన్. అతడు రంగం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరోసారి అంతకుమించిన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడన్న టాక్ వచ్చింది. అందాల చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ సినిమాకి పెద్ద ప్లస్ అంటూ విమర్శకులు ప్రశంసించారు. కాజల్ అందాల విందు యూత్‌కి మత్తెక్కిస్తుందన్న టాక్ వచ్చింది. పాటలు, సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ.చాలా కాలం తర్వాత చక్కిలిగింతలు పెట్టుకుని నవ్వుకోవాల్సిన కర్మ లేని సినిమా ఇదని క్రిటిక్స్ ప్రశంసించారు. ఫన్, సిట్యుయేషనల్ కామెడీ, జీవా-కాజల్ రొమాన్స్ అద్భుతంగా వర్కవుటైంది. పోలీస్ స్టేషన్, బోట్ కామెడీ సీన్స్ హైలైట్ అంటూ ప్రశంసలొచ్చాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్ మైండ్ బ్లోవింగ్. అభినందన్ సినిమాటోగ్రఫీ సూపర్భ్ అన్న టాక్ వచ్చింది'' అన్నారు. తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నా... తమిళ వెర్షన్ బ్లాక్‌బస్టర్ రిపోర్టుతో నడుస్తుండడం సంతోషాన్నిచ్చిందని నిర్మాత అన్నారు.
బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.