సైలెంట్‌గా.. వెంకీ కుమార్తె పెళ్లి
- IndiaGlitz, [Thursday,March 21 2019]
టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రితకు, హైదరాబాద్ రేస్ క్లబ్ సురేందర్‌రెడ్డి వారసుడు వినాయక్ రెడ్డికి మార్చి 24న వివాహం జరగనుంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరద్దరు మార్చి 24న ఒకింటివారు కాబోతున్నారు. ఇటీవల సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది.
ఆశ్రిత ప్రొఫెషనల్ బేకర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ తన బేకింగ్ అంశాలను పంచుకుంటూ ఉంటారు. సురేష్‌బాబు పెళ్లిపెద్దగా అన్ని పనులు చూస్తున్నారు. వీరి పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరగనుంది. రానా, చైతన్య, సమంత ఇలా కొంత మంది సినీ సెలబ్రిటీలు వివాహానికి హాజరు కాబోతున్నారట. పరిమిత సంఖ్యలో మాత్రమే ఆహ్వానాలు అందాయట. హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారట.