వెంకటేష్ బర్త్‌డే కానుకగా.. ‘ఎఫ్ 3’ అధికారిక ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెంకీ, వరుణ్‌లు.. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ కౌర్‌తో కలిసి చేసిన కామెడీ.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. 2019లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి అల్లుళ్లు వస్తున్నారంటూ విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
అయితే విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది. మోర్ ఫన్‌తో.. ఎఫ్2 సీక్వెల్‌గా 'ఎఫ్ 3'ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. మరి ఈ సీక్వెల్లో హీరోయిన్స్‌గా తమన్నా, మెహ్రీన్‌లే కొనసాగుతారో మరెవరినైనా తీసుకుంటారో చూడాలి. అయితే విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న 'ఎఫ్ 3' గురించి అధికారిక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో కూడా చాలా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
వీడియోలో ముందుగా.. ‘ఎఫ్ 2’ ట్రైలర్‌లోని కొంత భాగాన్ని తీసుకుని అనంతరం ‘ఎఫ్ 3’ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం' అని వెంకీ వాయిస్‌లో... 'నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా' అని వరుణ్‌తేజ్ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు ఎఫ్2 పాపులర్ అయిన 'అంతేగా ..అంతేగా..' అనే డైలాగ్‌తో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. లైక్స్ కూడా వేలల్లోనే వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments