'కేటుగాడు' చిత్రాన్నిసక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత వెంకటేష్ బాలసాని
Send us your feedback to audioarticles@vaarta.com
తేజస్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కేటుగాడు'. ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 18న విడుదలైంది. వెంకటేష్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్ బాలసాని నిర్మించారు. సినిమా విడుదలైన మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా...
చిత్ర నిర్మాత వెంకటేష్ బాలసాని మాట్లాడుతూ ''మా కేటుగాడు చిత్రం ఈ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 18న విడుదలైంది. సినిమాని 160 థియేటర్స్‌లో విడుదల చేశాం. విడుదలైన అన్నీచోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు కలెక్షన్స్ అన్నీ బావున్నాయి. తేజస్, చాందిని కొత్తవారైనప్పటికీ మంచి నటను కనపరిచారు. అజయ్, రాజీవ్ కనకాల వంటి సీనియర్స్ నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సప్తగిరి, ప్రవీణ్ కామెడి ట్రాక్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. మల్హర్ భట్ కెమెరావర్క్,సాయికార్తీక్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. కిట్టు నల్లూరి సినిమాని ఆద్యంతం కామెడితో పాటు ఆసక్తిగా ఉండేలా డైరెక్ట్ చేశారు. సినిమా రిలీజ్‌కి ముందు మేం ఎలాంటి సక్సెస్‌ణు ఎక్స్‌పెక్ట్ చేశామో అంతకంటే మంచి టాక్‌తో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సపోర్ట్ చేసిన వారికి థాంక్స్'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments