వెంకీ బాబు..బంగారం రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం బాబు...బంగారం. ఈ చిత్రాన్నిసూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంక‌టేష్ వినోదం అందించే పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. వెంకీకి జోడిగా న‌య‌న‌తార న‌టిస్తుంది. డిసెంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించిన బాబు...బంగారం జ‌న‌వ‌రి నుంచి ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రుపుకుంటున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్త‌య్యింది. గోపాల గోపాల త‌ర్వాత వెంకీ, భలే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత మారుతి క‌ల‌సి చేస్తున్న సినిమా కావ‌డంతో బాబు...బంగారం పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. వినోదం ప్ర‌ధానంగా రూపొందుతున్న బాబు...బంగారం చిత్రాన్నిజులై 1న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

26న వ‌స్తున్న వీరి వీరి గుమ్మ‌డి పండు..

నూత‌న న‌టీన‌టులు రుద్ర‌, వెన్నెల జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు.

అంద‌రూ చూడ‌ద‌గ్గ చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ క‌ళ్యాణ వైభోగ‌మే - నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్

అలా...మొద‌లైంది, అంత‌కు ముందు ఆత‌ర్వాత‌, హోరా హోరి...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌ను అందిస్తున్న అభిరుచి గ‌ల నిర్మాత కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్. నాగ శౌర్య - మాళ‌విక నాయ‌ర్ జంట‌గా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించిన తాజా చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే.

'కృష్ణాష్టమి' సక్సెస్ మీట్

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలనునిర్మించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి. గోల్డెన్ స్టార్ సునీల్, నిక్కిగల్రాని, డింపుల్ చోపడే  హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా ఫిభ్రవరి 19న విడుదలై మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

సినిమా హైలెట్ సీన్స్ చిత్రీక‌ర‌ణ‌లో  స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. హార్స్ మేళ సీన్స్ ని షూట్ చేస్తున్నారు.

24ఫ్రేమ్స్ అకాడమీ ఉత్తమ చిత్రం 'లజ్జ'

24ఫ్రేమ్స్ అకాడమీ సంస్థ గతం లో c.i.d విశ్వనాధ్ వంటి ప్రయోగాత్మక సీరియల్ ను నిర్మించింది . మరియు ఏంతో  మంది క్రొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శిక్షణ నిస్తున్నది