ఆ వార్తలు జస్ట్ రూమర్స్ అంటున్న వెంకీ..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాబు బంగారం చివర దశకు చేరుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు బాబు బంగారం రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే...బాబు బంగారం సినిమా తర్వాత తమిళ్ లో విజయం సాధించిన సేతుపతి, మలయాళంలో విజయం సాధించిన టు కంట్రీస్ చిత్రాల తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్పందిస్తూ...వెంకటేష్ సేతుపతి, టు కంట్రీస్ రీమేక్స్ లో నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే. వెంకటేష్ నటించే తదుపరి చిత్రాల గురించి ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com