మరోసారి పోలీస్ పాత్రలో వెంకీ..
Send us your feedback to audioarticles@vaarta.com
‘గురు’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సీనియర్ కథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. తన తదుపరి సినిమాలను కూడా వెంకీ లైన్‌లో పెడుతునట్టుగా సమాచారం. ఈ క్రమంలో నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ (ప్రచారంలో ఉన్న పేరు) లైన్‌లో ఉండగా.. ఇదే వరుసలో త్రినాథరావు నక్కినతో కూడా సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా.. తాజాగా ఈ సినిమాను తానే నిర్మించనున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు స్వయంగా తెలిపారు. త్రినాథరావు గత చిత్రాలకు (‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’) కథను అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ.. ఈ సినిమాకి కూడా కథను అందించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఈ మూవీలో వెంకీ హ్యుమరస్‌గా సాగే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రినాథరావు, ప్రసన్న కుమార్ ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత వెంకీ సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com