ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
పాతికేళ్ళ క్రితం వచ్చిన 'సుందరకాండ' (1992) సినిమాలో లెక్చరర్‌గా కనిపించి.. తన మార్క్ కామెడీతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించారు విక్టరీ వెంకటేష్. మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రొఫెసర్‌గా తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారాయన. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే' పేరుతో రూపొందుతున్న సినిమా కోసం వెంకటేష్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా అవతారమెత్తుతున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే వెంకీ లుక్‌కు సంబంధించిన స్టిల్ ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్పోరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను ప్రశ్నించే ఓ ప్రొఫెసర్ కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. అలాగే ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్ధులు ఒత్తిడికి గురవడంతో పాటు.. ఈ పోటీ వ్యవస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనాన్ని కూడా తెరపై చూపించనున్నారని సమాచారం.
ప్రముఖ విద్యా సంస్థలను టార్గెట్ చేస్తూ.. సెటైరిక్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆలోచింప చేసే విధంగా సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. వెంకీకి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వారంలోనే పట్టాలెక్కనున్న ఈ మూవీని.. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments