ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌గా వెంక‌టేష్‌

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

పాతికేళ్ళ క్రితం వ‌చ్చిన 'సుందరకాండ' (1992) సినిమాలో లెక్చరర్‌గా కనిపించి.. తన మార్క్‌ కామెడీతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించారు విక్ట‌రీ వెంకటేష్. మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రొఫెసర్‌గా తెరపై సందడి చేయడానికి సిద్ధ‌మ‌వుతున్నారాయ‌న‌. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే' పేరుతో రూపొందుతున్న‌ సినిమా కోసం వెంకటేష్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా అవ‌తార‌మెత్తుతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్ప‌టికే వెంకీ లుక్‌కు సంబంధించిన స్టిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కార్పోరేట్‌ ఎడ్యుకేషన్ సిస్ట‌మ్‌ను ప్రశ్నించే ఓ ప్రొఫెస‌ర్ క‌థ‌గా ఈ సినిమా తెరకెక్కుతోంద‌ని తెలిసింది. అలాగే ప్ర‌స్తుత‌ విద్యా వ్యవస్థలో విద్యార్ధులు ఒత్తిడికి గురవడంతో పాటు.. ఈ పోటీ వ్యవస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనాన్ని కూడా తెరపై చూపించనున్నారని స‌మాచారం.

ప్ర‌ముఖ విద్యా సంస్థలను టార్గెట్ చేస్తూ.. సెటైరిక్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆలోచింప చేసే విధంగా సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. వెంకీకి జోడీగా శ్రియ న‌టిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వారంలోనే పట్టాలెక్కనున్న ఈ మూవీని.. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More News

శ్రీనివాస కళ్యాణం కోసం భారీ సెట్

స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ 'శతమానం భవతి' మంచి విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని చాలా భావోద్వేగంగా చూపించి ప్రేక్షకుల మన్ననలను పొందడమే కాదు.. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

'ఛల్ మోహన్ రంగ' 'పెద్దపులి' సాంగ్ రిలీజ్

నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ" అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం "ఛల్ మోహన్ రంగ"లో రీక్రియేట్ చేస్తున్నారు.

ఇక‌నైనా డిజిట‌ల్ ఛార్జీల త‌గ్గింపు పై ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకోవాలి- ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డంలేదు.

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న నెల్లూరి పెద్దారెడ్డి...

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'రాజరథం' లో 'చల్ చల్ గుర్రం' అంటూ వస్తున్న రవి శంకర్

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే  నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో  మరోసారి ఆశ్చర్యపరచనుంది.