అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

  • IndiaGlitz, [Friday,April 26 2019]

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి ఓ సినిమా కలిసి వర్క్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో వీరు కలిసి నటించట్లేదు. ఒకప్పుడు చిన్నపిల్లను ఆకట్టుకున్న ‘అల్లాదిన్’ సినిమాను ఇపుడు అమెరికాకు చెందిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అల్లాదిన్’ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాదిన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.