తోడల్లుళ్ళు పాత్రల్లో వెంకీ, వరుణ్?
Send us your feedback to audioarticles@vaarta.com
‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంతవరకు యంగ్ హీరోస్‌తోనూ, సీనియర్ హీరోతోనూ విడివిడిగా సినిమాలను చేసి విజయం సాధించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు తొలిసారిగా యంగ్ హీరో వరుణ్ తేజ్, సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్లో ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా నటించనుండగా.. వరుణ్‌కు జంటగా మెహరీన్ కనిపించనుంది. సరదా, నిరాశల మధ్య సాగిపోయే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా..ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్ళుగా నటించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎప్పటి నుంచో వెంకి అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 23న పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 29 వరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ట్యూన్స్‌ను ఫైనల్ చేసే పనిలో ఉంటారు దర్శక నిర్మాతలు. అటుపై ఈ నెల 30 నుంచి 20 రోజుల పాటు నిరవధికంగా హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాని 2019 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com