హిట్ రీమేక్‌లో వెంకీ, రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా పరభాషల్లో హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడానికో, అనువాదం చేయడానికో ఆసక్తి చూపుతుంటారు. అలా ఆసక్తి చూపిన సినిమాల్లో 'విక్రమ్ వేద' ఒకటి. పోలీస్, గ్యాంగ్‌స్టర్ మధ్య నడిచే ఎమోషన్ యాక్షన్ డ్రామా ఇది.
ఈ సినిమా విడుదల తర్వాత నుండి రీమేక్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ రీమేక్ ఓ కొలిక్కి రానుంది. వివరాల ప్రకారం విక్టర్ వెంకటేష్, నారా రోహిత్‌లతో ఈ సినిమాను నిర్మించడానికి డి.సురేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. పాత్రల ప్రకారం చూస్తే.. తమిళంలో మాదవన్ పోషించిన పోలీస్ పాత్రలో నారా రోహిత్.. విజయ్‌సేతుపతి పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో వెంకటేష్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com