‘నారప్ప’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన వెంకీ

  • IndiaGlitz, [Thursday,April 29 2021]

కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’, ‘విరాటపర్వం’, ‘లవ్ స్టోరీ’ తదితర చిత్రాలు తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకోగా.. తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంది. బ్రహ్మోత్సవం తర్వాత కొన్నేళ్లపాటు గ్యాప్ తీసుకుని శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన సినిమా ‘నారప్ప’. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 14న రిలీజ్ చేయాలని తొలుత భావించిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు.

‘‘నారప్ప’ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు.. అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని. అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ.. అంకిత భావంతోనూ పని చేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లలోనే ఉండి మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగానే ఎదుర్కొందాం. అందరం మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ, సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వెంకీ ట్వీట్‌లో పేర్కొన్నారు..

నిర్మాత సురేష్ బాబు. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్‌కు రెండోసారి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన 'అసురన్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఉన్నదున్నట్లు ఇక్కడ శ్రీకాంత్ అడ్డాల రీమేక్ చేస్తున్నారు. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని తొలుత అంతా భావించారు. కానీ చిత్ర యూనిట్ అదేమీ లేదని రిలీజ్ డేట్‌ను వాయిదా వేయడం ద్వారా వెల్లడించింది. పరిస్థితులు చక్కబడిన మీదట చిత్రాన్ని రిలీజ్ చేస్తామని హీరో వెంకటేష్ దగ్గుబాటి వెల్లడించారు.

More News

తెలంగాణలో 7,994 మందికి కరోనా.. గాంధీకి రావొద్దంటున్న వైద్యులు

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది.

గంట వ్యవధిలో భిన్నమైన స్టేట్‌మెంట్స్.. లాక్‌డౌన్ లేనట్టేనట..

బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో తెలంగాణలో రెండు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అవేంటంటే 30 తరువాత ఏ క్షణమైనా లాక్‌డౌన్ విధించవచ్చనేది ఒకటి..

కరోనాకు చెక్ పెట్టిన ‘లవ్ స్టోరీ’.. ఇన్‌స్పైరింగ్..

శేఖర్ కమ్ముల దర్వకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ల‌వ్ స్టోరీ’.

కరోనా వ్యాక్సిన్ 50 శాతం వ్యాప్తిని అరికడుతుందట..

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం కరోనా బారిన పడుతుండటంతో పాటు..

'ఎదురీత' సెన్సార్ పూర్తి... త్వరలో విడుదలకు సన్నాహాలు

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఎదురీత'.