‘నారప్ప’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన వెంకీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’, ‘విరాటపర్వం’, ‘లవ్ స్టోరీ’ తదితర చిత్రాలు తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకోగా.. తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంది. బ్రహ్మోత్సవం తర్వాత కొన్నేళ్లపాటు గ్యాప్ తీసుకుని శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన సినిమా ‘నారప్ప’. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 14న రిలీజ్ చేయాలని తొలుత భావించిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు.
‘‘నారప్ప’ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు.. అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని. అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ.. అంకిత భావంతోనూ పని చేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లలోనే ఉండి మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగానే ఎదుర్కొందాం. అందరం మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ, సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వెంకీ ట్వీట్లో పేర్కొన్నారు..
నిర్మాత సురేష్ బాబు. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్‌కు రెండోసారి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన 'అసురన్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఉన్నదున్నట్లు ఇక్కడ శ్రీకాంత్ అడ్డాల రీమేక్ చేస్తున్నారు. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని తొలుత అంతా భావించారు. కానీ చిత్ర యూనిట్ అదేమీ లేదని రిలీజ్ డేట్‌ను వాయిదా వేయడం ద్వారా వెల్లడించింది. పరిస్థితులు చక్కబడిన మీదట చిత్రాన్ని రిలీజ్ చేస్తామని హీరో వెంకటేష్ దగ్గుబాటి వెల్లడించారు.
In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
— Venkatesh Daggubati (@VenkyMama) April 29, 2021
Stay safe ??! #NarappaPostponed#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/7QWIL8lOG6
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout