వెంకటేష్‌, నాగచైతన్య ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్‌

  • IndiaGlitz, [Friday,April 26 2019]

లగ్జరీ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్‌, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి విలాసవంతమైన డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించి.. జ్యోతి ప్రజ్వలన చేయగా, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య నాలుగు నూతన స్క్రాంబ్లర్‌ మోడల్స్‌ను (స్క్రాంబ్లర్‌ ఐకాన్‌, డెసర్ట్‌ స్లెడ్‌, ఫుల్‌ థ్రోటెల్‌, కేఫ్‌ రేసర్‌) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్జీ కనోవాస్‌ మాట్లాడుతూ - ''ఈ స్క్రాంబ్లర్‌ శ్రేణిని దేశంలో ఎక్కువమంది అభిమానిస్తారు. ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఈ డుకాటి ఫ్యామిలీ స్క్రాంబ్లర్‌ యాక్సెసబుల్‌ శక్తి, అత్యున్నత నియంత్రణను కలిగి ఉంటుంది. ఏ తరహా రోడ్లపై అయినా దీనిపై ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మేం మొత్తం శ్రేణిని అత్యాధునికంగా తీర్చిదిద్దాం. ఈ నూతన లైనప్‌ స్వేచ్ఛాయుత ధోరణితో సాంస్కృతిక ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుంది. డుకాటి స్క్రాంబ్లర్‌ కేవలం బైక్‌ మాత్రమే కాదు.. ఇది పూర్తి సరికొత్త జీవనశైలి. పూర్తిగా అంకితం చేయబడిన అప్పెరల్‌ మరియు యాక్సెసరీలు దీనిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో మా మొట్టమొదటి ఉత్పత్తి ఆవిష్కరణ ఇది. భారతదేశంలో మా నూతన స్క్రాంబ్లర్‌ శ్రేణి పరిచయం చేయడం పట్ల ఆనందంగా ఉన్నాం'' అన్నారు.

ఎస్‌ అండ్‌ ఎస్‌ ఆటోనేషన్‌, డీలర్‌ ప్రిన్సిపల్‌ కోటి పరుచూరి మాట్లాడుతూ - ''మా షోరూమ్‌ను ప్రారంభించిన విక్టరీ వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్యగారికి కృతజ్ఞతలు. డుకాటి నాకు చిన్నప్పటి నుండి ఒక యాస్పిరేషనల్‌ బ్రాండ్‌గా ఉండేది. అన్ని విభాగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న డుకాటి ఇండియాలో 9వ షోరూమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సహకరించిన డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్జీ కనోవాస్‌గారికి ధన్యవాదాలు. ఈ సుప్రసిద్ధ సిరీస్‌ మరింత సమకాలీనంగా, మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండటంతో పాటుగా మరింత స్వేచ్ఛాయుత వినోద ప్రపంచానికి తోడ్కొని పోతుంది. ఈ అత్యాధునిక 'జాయ్‌వోల్యూషన్‌' మోటార్‌ సైకిల్‌ యొక్క సంపూర్ణ సారాంశం కలిగి ఉండి, దీని ద్విచక్రాలు, పెద్ద హ్యాండిల్‌ బార్‌, సరళమైనప్పటికీ శక్తివంతమైన ఇంజిన్‌ మరియు పూర్తి వినోదాన్ని అందిస్తుంది'' అన్నారు.

More News

నేటి తరానికి నవలా రూపంలో సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు'

పద్మభూషణ్ - సూపర్ స్టార్,  నటశేఖర హీరో కృష్ణ నిర్మించి నటించిన పద్మాలయా మూవీస్  భారీ చిత్రం  'మోసగాళ్లకు మోసగాడు' అప్పట్లో ఘనవిజయం

రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కుట్ర జరిగిందా!?

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధు.. ప్రత్యర్థులకు దడ!

చైనాలోని వుహాన్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సమీర్ వర్మలు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

విద్యార్థుల ఆత్మహత్యల పై మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్!

తెలంగాణ ఇంటర్ ఫలితాల అనంతరం అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో చలించిపోయిన టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

వారణాసిలో నరేంద్ర మోదీ నామినేషన్.. బలప్రదర్శన!

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి