డిసెంబర్ 16న వెంకటేష్ , నయనతార, మారుతి చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
'దృశ్యం', 'గోపాల గోపాల' లాంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత విక్టరి వెంకటేష్ , వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌత్ఇండియన్ క్వీన్ నయనతార జంటగా,' భలేభలేమగాడివోయ్' చిత్రం తో డబుల్ హ్యట్రిక్ దిశగా దూసుకుపోతున్న ట్రెండి దర్శకుడు మారుతి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్సణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-2 గా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం డిసెంబర్ 16 న పూజాకార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ని ప్రాంరభిస్తున్నారు. 'రన్‌రాజారన్', 'జిల్', 'ఉత్తమవిలన్' లాంటి చిత్రాలకు అద్యుతమైన సంగీతాన్ని అందించిన జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. మా బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రోడక్షన నెం2 గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 'లక్ష్మి',' తులసి' చిత్రాలతో సూపర్ హిట్ కాంబినేషన్ గా టాలీవుడ్ లో రికార్డులు క్రియోట్ చేసిన విక్టరి వెంకటేష్, నయనతార లు జంట గా నటిస్తున్నారు. రెండు వరుస చిత్రాలతో వెంకటేష్ గారు, వరుస విజయాలతో నయనతార గారు కలసి నటించటమే కాక 'భలే భలే మగాడు' చిత్రం తో మారుతి యాడ్ అవ్వటంతో ఈ ప్రోజెక్ట్ కి ప్రేక్షకుల్లొ సూపర్ పాజిటివ్ క్రేజ్ వచ్చింది. ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు నచ్చింది. వెంకటేష్ గారికి కూడా నచ్చటంతో చిత్రాన్ని డిసెంబర్ 16న పూజాకార్యక్రమాలు జరుపుకుని అదేరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటాం.
వెంకటేష్ గారి చిత్రాలనుండి అలాగే మారుతి చిత్రాల నుండి ప్రేక్షకులు ఆశించే ఫ్యామిలి ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా వుంటుంది. తమిళంలో ఎన్నోభారీ చిత్రాలకు సంగీతాన్ని అందించి తెలుగులో 'రన్‌రాజారన్', 'జిల్', లాంటి చార్ట్‌బస్టర్స్ అందించిన జిబ్రాన్ ఈచిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.వివేక్ ఆనంద్ సినిమాటొగ్రాఫర్, ఉద్దవ్. ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎటువంటి టైటిల్ అనుకోలేదు. త్వరలో మిగిలిన నటీనటుల వివరాలు , సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ జరిపి 2016 సమ్మర్ లో విడుదల చేస్తాము.. అని అన్నారు
సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), సంగీతం:జిబ్రాన్, కెమెరా:ఎస్.వివేక్ ఆనంద్, ఎడిటింగ్: ఉద్దవ్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com