వెంకీ ఇంకోసారి ఒప్పుకున్నాడోచ్!
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్ ఎప్పుడూ రొటీన్‌ని ఫాలో కావాలని అనుకోరు. అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ ట్రెండ్ సెట్ చేద్దామని అంటారు. ఈగోల గోల లేకుండా ఉంటేనే ఆనందం అని నమ్ముతారు. బాహ్యప్రపంచం అంతా మిథ్య.. మనం కేవలం ఆటబొమ్మలం, మనిషి చేయాల్సిన ప్రయాణం మరొకటి.. ప్రస్తుతం పడుతున్నా ఆరాటం మాత్రం శాశ్వతం కాదు అని ప్రగాఢంగా నమ్ముతారు వెంకటేశ్.
అందుకే సినిమాల్లోనూ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగానే ఆయన మహేశ్‌తో కలిసి `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, రామ్‌తో కలిసి `మస్కా`, పవన్ కల్యాణ్‌తో కలిసి `గోపాలా గోపాలా` సినిమాల్లో నటించారు. తాజాగా ఆయన మరో మల్టీస్టారర్‌కు పచ్చజండా ఊపారు. ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా కలిసి నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇదివరకే దగ్గుబాటి ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటుంన్నారు. రానాకు, విజయ్ దేవరకొండకు మధ్య మంచి స్నేహమే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com