నాని చిత్రంలో వింకీ బ్యూటీ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాల హీరోగా పేరున్న నానికి `కృష్ణార్జునయుద్ధం` బ్రేక్ వేసింది. ఇప్పుడు నాని `మళ్ళీరావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `జెర్సీ` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని తన పార్ట్‌ను త్వరగానే పూర్తి చేసేయనున్నాడు. ఫిబ్రవరి 19నుండి నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.
హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటించనుందని వార్తలు వినపడుతున్న తరుణంలో ఈ చిత్రంలో వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయట. `మజ్ను` చిత్రంతో అను ఇమ్మాన్యుయేల్, `నిన్నుకోరి` చిత్రంతో నివేదా థామస్‌ను తెలుగు సినిమాలకు పరిచయం చేసిన నాని విసయంలో అంతా అనుకున్నట్లు జరిగితే ప్రియా ప్రకాశ్ వారియర్‌ను కూడా తెలుగు సినిమాలకు పరిచయం చేసే హీరో అవుతాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com