నాని చిత్రంలో వింకీ బ్యూటీ..!!

  • IndiaGlitz, [Saturday,January 26 2019]

వ‌రుస విజ‌యాల హీరోగా పేరున్న నానికి 'కృష్ణార్జున‌యుద్ధం' బ్రేక్ వేసింది. ఇప్పుడు నాని 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని త‌న పార్ట్‌ను త్వ‌ర‌గానే పూర్తి చేసేయ‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రి 19నుండి నాని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

హీరోయిన్‌గా మేఘా ఆకాష్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న త‌రుణంలో ఈ చిత్రంలో వింకీ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే చ‌ర్చ‌లు ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నాయ‌ట‌. 'మజ్ను' చిత్రంతో అను ఇమ్మాన్యుయేల్‌, 'నిన్నుకోరి' చిత్రంతో నివేదా థామ‌స్‌ను తెలుగు సినిమాల‌కు ప‌రిచ‌యం చేసిన నాని విస‌యంలో అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ప్రియా ప్ర‌కాశ్ వారియర్‌ను కూడా తెలుగు సినిమాలకు ప‌రిచ‌యం చేసే హీరో అవుతాడు.