Saindhav Trailer: యాక్షన్ సీన్స్‌తో 'సైంధవ్' ట్రైలర్.. సైకోగా అదరగొట్టిన వెంకీ..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'(Saindhav). 'హిట్', 'హిట్ 2' చిత్రాల దర్శకడు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ మూవీ వెంకీ 75వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీ కుమార్తెల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విపరీతంగా ఉంటాయని ఇందులో చూపించారు.

3 నిమిషాల 36 సెకన్లుగా ఉన్న ఈ ట్రైలర్‌లో వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకువస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. దీంతో ఆ డబ్బులు కోసం వెంకీ ఏం చేశాడనేది సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా సెటిల్డ్ యాక్టింగ్‌తో వెంకటేశ్ అదరగొట్టారని అర్థమవుతోంది.

ఇక సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయన సైకో విలన్‌ పాత్ర చేశారు. వీరితో పాటు తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ తదితరులు నటించారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి దీనిని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

ఇక సంక్రాంతికి ఈ మూవీతో పాటు గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, నా సామిరంగ చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఇవే కాకుండా రెండు తమిళ చిత్రాలు కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరో అవుతారో వేచి చూడాలి.

More News

YS Sharmila: సీఎం జగన్‌తో భేటీ కానున్న వైయస్ షర్మిల.. సర్వత్రా ఆసక్తి..

కొన్ని సంవత్సరాలుగా ఉప్పు నిప్పులుగా ఉన్న సీఎం జగన్(CM Jagan), ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) తాడేపల్లిలో భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో

సామాజిక సాధికారిత ఆధారంగా వైసీపీ కొత్త ఇంఛార్జ్‌ల ప్రకటన

త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపడుతోంది. సామాజిక సాధికారతే ధ్యేయంగా

కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు సిద్ధం: వైయస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని వైయస్ షర్మిల(YS Sharmila) స్పష్టంచేశారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి, తల్లి వైఎస్‌

Chandrababu: ఎన్నికల వేళ ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు

ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రజల్లోనే ఉండేలా టీడీపీ(TDP) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), యువనేత లోకేష్‌(Lokesh)తో పాటు భువనేశ్వరి(Bhuvaneswari) కూడా ప్రజల్లోకి

Nadendla: వైసీపీ తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలు రద్దు చేస్తాం: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలను టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు.