నా 30 ఏళ్ళ కెరీర్ లో నేర్చుకున్న విషయాల కంటే 'గురు' సినిమాలో ఎక్కువ నేర్చుకున్నాను - వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలి పాత్రలో రూపొందిన చిత్రం `గురు`. వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధకొంగర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎస్.శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల, పాటల ప్రదర్శన కార్యక్రమం సోమవారం హైదరాబాద్ దస్పల్లా హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెకంటేష్, డైరెక్టర్ సుధ కొంగర, నిర్మాత ఎస్.శశికాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చక్రవర్తి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా....
వెంకటేష్‌గారి కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీ
చిత్ర నిర్మాత ఎస్.శశికాంత్ మాట్లాడుతూ - ``ఈ సినిమా ముందుగా హిందీ, తమిళంలో విడుదలై పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. తమిళంలో సినిమా విడుదల కావడాని కంటే ముందుగానే తెలుగులో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఒరిజినల్ సినిమా విడుదలకు ఒకటిన్నర నెల ముందుగానే వెంకటేష్‌గారు సినిమా చూసి చేస్తానన్నారు. ఏదో ప్రూవ్ అయిన సినిమా కదా...అని చేయకుండా ఎంతో కమిట్మెంట్తో వర్క్ చేశారు. ఆయన అందించిన సపోర్ట్‌కు థాంక్స్. ఎందుకంటే వెంకటేష్‌గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయనలోపలే ఓ కోచ్ ఉంటారు. అలా ఆయన పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ దొరకడం చాలా రేర్‌గా దొరుకుతుంది. వెంకటేష్‌గారి కెరీర్లో మైల్స్టోన్ మూవీ అవుతుందని చెప్పగలను`` అన్నారు.
కమిట్మెంట్ ఉన్న హీరో
సుధ కొంగర మాట్లాడుతూ - ``ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు సినిమా జర్నీ గురించి చెప్పాలి. ను మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ సినిమా ఐడియా వచ్చింది. 2010లోనే ఈ కథను తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మూడు నాలుగేళ్ళు కథపై రీసెర్చ్ చేశాను, అందుకోసం 250 మంది బాక్సర్స్‌ను, కోచ్‌లను కలిసి ఈ కథను తయారు చేసుకున్నాను. హిందీ, తమిళంలో గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. నేకథను తయారు చేసుకున్నాను. కథ తయారు కాగానే ముందు నేను కలిసింది వెంకటేష్‌గారినే. అయితే కొన్ని కారణాలతో సినిమా చేయలేకపోయాం. తర్వాత హిందీ, తమిళంలో సినిమా చేసిన తర్వాత విడుదల కాకముందే వెంకటేష్‌గారికి సినిమా చూపిస్తే, ఇప్పుడు నన్ను పెట్టి తెలుగులో సినిమా తీయ్ అన్నారు. వెంకటేష్‌గారిని గురు సెట్స్‌లో చూడటానికి నాకు మూడేళ్ళ నాలుగు నెలల సమయం పట్టింది. నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నేను ఎంతో మంది స్టార్స్‌తో వర్క్ చేశాను. అయితే వెంకటేష్‌గారి వంటి కమిట్మెంట్, హ్యుమాలియాలిటీ, సిన్సియారిటీ చూడలేదు. ఈ సినిమా మేకింగ్ వెంకటేష్‌గారు గాయపడినా దాని వల్ల షూటింగ్ ఎక్కడా ఆపలేదు. వెంకటేష్‌గారితో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. రితికసింగ్ గత ఆరేళ్ళుగా నాతో ట్రావెల్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ అయినా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ముంతాజ్ కూడా మంచి బాక్సర్, రితిక, ముంతాజ్‌లు సిస్టర్స్‌గా నటించారు. నిర్మాత శశికాంత్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. రామ్ ఎంతగానో సపోర్ట్ చేశారు. ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
ఇన్స్పైరింగ్ క్యారెక్టర్
రితిక సింగ్ మాట్లాడుతూ - ``హిందీ, తెలుగులో సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో తెలుగులో కూడా అదే విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజ జీవితంలో నాన్నగారే నాకు రియల్ గురు. వెంకటేష్‌గారితో వర్క్ చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యాను. ఈ సినిమాకు నాకు నేషనల్ అవార్డ్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ చేశాను. సుధగారు ఎంతో బాగా తెరకెక్కించారు`` అన్నారు.
ముంతాజ్ మాట్లాడుతూ - ``గురు సినిమా చేయడం మరచిపోలేని జర్నీ. సుధగారు మా అందరికీ గురువులా, వర్క్‌తో అందరినీ చంపేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే నిర్మాత శశికాంత్‌గారు ఎంతో కేర్ తీసుకుని ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. వెంకటేష్‌గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది`` అన్నారు.
భాస్కర భట్ల మాట్లాడుతూ - ``ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. ముఖ్యంగా మందు పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సుధగారు మంచి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. వెకంటేష్గారు నాకు అత్యంత ఆప్తులు. ఒక మంచి సినిమా, అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
క్రెడిట్ అంతా సుధకే దక్కుతుంది
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ - ``నా 30 ఏళ్ళ కెరీర్లో ఎన్నో జోనర్ మూవీస్‌లో నటించాను. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చాయి. ఈ జర్నీలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ 30 ఏళ్ళలో నేర్చుకున్నదంతా ఒకటైతే గురు సినిమా సమయంలో నేర్చుకున్నది ఒకటి. నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత నాలో నేను కొత్త నటుడు అని చెప్పగలను. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు కారణం దర్శకురాలు సుధ కొంగర. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ఈ సినిమాను ముందుగా నేనే చేయాల్సింది కానీ జ్వరంతో చేయలేకపోయాను. హిందీ, తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని తమిళంలో విడుదల కాకముందే చూశాను. నాకు నచ్చింది. సినిమా చేద్దామనుకున్నాను. సుధ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చి పూర్తిగా చదవమంది. నా కెరీర్లో నా క్యారెక్టరేంటి, డైలాగ్స్ ఏంటని చదివేవాడినే కానీ పూర్తి స్క్రిప్ట్ ఎప్పుడూ చదవలేదు. నాకు ముందు కాస్తా కొత్తగా అనిపించినా, సరేనని స్క్రిప్ట్ మొత్తం చదివాను. ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది.
ఈ సినిమాలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నటించాను. రితిక, ముంతాజ్‌లు చక్కగా నటించారు. సుధ నా పాత సినిమాలన్నీ చూసి నా ముఖ కవళికలు ఎక్కడా రిపీట్‌కాకుండా కొత్తగా ఉండేలా చూసుకుంది. ఈ సినిమాలో నేను బాక్సింగ్ కోచ్ అంటే గురువుగా పనిచేశాను. కానీ సినిమా చేసే సమయంలో సుధ, నాకు గురువు అయ్యింది. నా నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో జింగిడి సాంగ్ కూడా నేను పాడాను. ట్యూన్ వినగానే ఎగ్జయిట్ అయ్యాను. సంతోష్ నారాయణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాతో నా ఆలోచన కొత్తగా మారింది. కొత్త క్యారెక్టర్స్ ఏదైనా చేసేయవచ్చుననే ఫీలింగ్ వచ్చింది. తప్పకుండా గురు సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను`` అన్నారు.
వెంకటేష్, రితిక సింగ్, ముంతాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలుః హర్షవర్ధన్, సంగీతంః సంతోష్ నారాయణన్, సినిటోగ్రఫీః కె.ఎ.శక్తివేల్, ఎడిటర్ః సతీష్ సూర్య, ఆర్ట్ః జాకీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః చక్రవర్తి రామచంద్ర, నిర్మాతః ఎస్.శశికాంత్, కథ, దర్శకత్వంః సుధ కొంగర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments