ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది: విక్టరీ వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి డైలాగ్ ని ఇంప్రవైజ్ చేయాల్సిందే. కొన్ని సార్లు వాయిస్ లోనే ఒకరకమైన ఫన్ పుడుతుంది. కొందరు మాట్లాడితేనే నవ్వొస్తుంది. అల్లు రామలింగయ్య గారు టిపికల్ వాయిస్ తో నవ్విస్తారు. అలాగే జానీ లీవర్ లాంటి నటులు కూడా తమ వాయిస్ తోనే ఆకట్టుకుంటారు.
వరుణ్ తేజ్ గురించి ఎం చెప్తారు ?
ఎఫ్ 2 లో మా కాంబినేషన్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ఎఫ్ 3లో వరుణ్ తేజ్ పాత్ర ఇంకా బావుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ తో వండర్ ఫుల్ జర్నీ.
డబ్బుకి మీరిచ్చే ప్రాధాన్యత ఏమిటి ?
డబ్బు అందరికీ కావాలి. దానికి కోసం అందరూ సరైన మార్గంలో కష్టపడాలి. ఈ నేచర్ మనకు కావాల్సింది ఇస్తుంది. లేనిదాని కోసం ఎక్కువ తాపత్రయపడకూడదు. వున్నదాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఆనందంగా బ్రతకాలి.
ఎఫ్ 2కి ఎఫ్ 3మధ్య ఎలాంటి తేడా వుంటుంది ?
ఎఫ్ 3లో మోర్ ఫన్ యాడ్ అయ్యింది. చాలా మంది నటులు యాడ్ అయ్యారు. సినిమా చాలా లావిష్ గా తీశాం. చాలా మంచి సీక్వెన్స్ లు వున్నాయి. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3 లో వుంది.
ఒకప్పుడు హీరోయిజం సినిమాలు, తర్వాత కంటెంట్ వున్న కథలు వచ్చాయి. ఇప్పుడు ఎక్స్ ట్రీమ్ హీరోయిజం వున్న సినిమాలు వస్తున్నాయి. ఈ వేవ్ ని ఎలా చూస్తారు ?
దేన్నీ ఎక్కువగా అలోచించకూడదు. ప్రతి సినిమా ప్రత్యేకమైనదే. ఇక్కడ ఆడియన్స్ ముఖ్యం. అల్టిమేట్ గా ప్రేక్షకులకు కంటెంట్ నచ్చాలి.
నెట్ ఫ్లిక్ష్ లో చేస్తున్న వెబ్ సిరిస్ గురించి ?
ఆ సిరిస్ చాలా వండర్ ఫుల్ గా వుంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పకూడదు. ఐతే కెరీర్ లో మొదటిసారి చాలా భిన్నమైన పాత్రలో కనిపిస్తా.
దిల్ రాజు గారి తో ఇది మూడో సినిమా.. ఆయనతో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
దిల్ రాజు గారు నాకు చాలా కాలం క్రితమే తెలుసు. 'ప్రేమించుకుందాం రా' సమయంలోనే ఆయన సినిమాలో స్పార్క్ గమనించారు. ఆయన సినిమాని చాలా బాగా పరిశీలిస్తారు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ వుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతో కృషి చేస్తే గానీ ఇన్ని విజయాలు రావు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటాను.
ఇది మీకు ఏడో మల్టీ స్టారర్.. మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకునే కాంబినేషన్ ఏది ?
కథ బావుంటే ఎవరితోనైనా మల్టీ స్టారర్ చేస్తా.
ప్రతి హీరోకి బాక్సాఫీసు లెక్కలతో కిక్ వుంటుంది.. మీకు లెక్కలకు ప్రాధాన్యత ఇస్తారా ?
ప్రతి సినిమా విజయం అవ్వాలానే కోరుకుంటా. బాక్సాఫీసు లెక్కలు సంగతి అటుంచితే నిర్మాతకు మేలు జరగాలని భావిస్తా. నిర్మాతకు అన్ని విధాల సహకరిస్తా. తర్వాత అంతా ప్రేక్షకుల చేతిలో వుంటుంది.
మీ సినిమా బడ్జెట్, ఫిలిం మేకింగ్ ప్లానింగ్ లో ఇన్వాల్ అవుతారా ?
నేను నిర్మాత పక్షాన ఆలోచిస్తా. సెట్ కి వెళ్ళిన తర్వాత ఏది వృధా జరుగుతున్నా ఒప్పుకోను. ఇక ఫిలిం మేకింగ్ ప్లానింగ్ కి ఒక ఫార్ములా అనేది వుండదు. అంతిమంగా రిజల్ట్ బావుంటే.. మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం.
మీకు పాన్ ఇండియా సినిమా చేయాలని ఉందా ?
పాన్ ఇండియా గురించి పెద్దగా అలోచించలేదు. ఐతే సరైన టీం కుదిరితే తప్పకుండా చేస్తా.
ఏదైనా రియాలిటీ షోకి హోస్ట్ చేయాలనీ ఉందా ?
ఇది వరకే చాలా మంది నన్ను సంప్రదించారు. ఐతే రియాలిటీ షో చేయడంలో నాకు చిన్న ఇబ్బంది వుంది. చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వమంటే రెండు మూడుసార్లు తర్వాత నాకు ఎదో తెలియని బ్లాక్ వచ్చేస్తుంది.
మీ అబ్బాయిని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ?.
చదువుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు.
కోవిడ్ టైం లో షూటింగ్ ఎలా అనిపించింది ?
చాలా కష్టం అనిపించింది. అవతలి ఆర్టిస్ట్ కి కోవిడ్ వుందో లేదో తెలీదు. చెప్పరు (నవ్వుతూ) షాట్ అయిన తర్వాత బస్ లో సానిటైజ్ చేసుకోవడం కంపల్సరి. ఐతే దేవుడి దయవల్ల నేను కోవర్జిన్ ని. (నవ్వుతూ) ఇప్పటివరకూ కరోనా సోకలేదు.
సినిమా చేసినప్పుడే కనిపిస్తారు. మిగాత సమయంలో ఎక్కడా కనిపించరు .. కారణం ?
ఎవరితో కలవకూడదని కాదు. సినిమా తప్ప బయటికి వచ్చి మాట్లాడానికి మరో టాపిక్ వుండదు కదా. ఫ్యామిలీతో గడపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. మెడిటేషన్, ధ్యానం చేస్తుంటాను.
మీ నాన్నగారి బయోపిక్ లో నటిస్తారా ?
చేస్తే బాగానే వుంటుంది. ఐతే స్క్రిప్ట్ కుదరాలి కదా.. వివేకానంద కథ అనుకున్నాను. అది కుదరలేదు.
ఎఫ్ 3లో మీకు పెరిగిన బాధ్యతలు ఏమిటి ?
ఎఫ్ 2కు మించిన వినోదం ప్రేక్షకులు ఆశిస్తారు. అది అందించడమే పెద్ద బాధ్యత. ఐతే ఆ భాద్యతని విజయవంతంగా నిర్వర్తించాం. ఎఫ్ 3 హిలేరియస్ గా వుంటుంది.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ?
దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి డ్యాన్స్ నెంబర్స్ వున్నాయి. అలాగే శ్రీరామ్ డీవోపీ కూడా వండర్ ఫుల్ గా వుంది. ఎఫ్ 3లో నటీనటులు, టెక్నిషియన్లు అందరూ అద్భుతం గా చేశారు.
ఎఫ్ 3లో మీకు ఎవరితో కాంబినేషన్ వుంటుంది ? వెంకీ ఆసనంలా కొత్త ఆసనం ఏదైనా ఉందా ?
ఇందులో అందరితోనూ నాకు కాంబినేషన్ వుంటుంది. ఎఫ్ 2లో వెంకీ ఆశన్ చాలా పాపులర్ అయ్యింది. పిల్లలు కూడా దాన్ని చేయడం చూసి నేనే సర్ ప్రైజ్ అయ్యా. ఇలాంటి సినిమాలు వాళ్లకి నచ్చుతున్నాయనే ఆనందం వుంది.
రియల్ లైఫ్ లో ఫస్ట్రేషన్ ఉంటుందా ?
వుండదు. కానీ నేను టైం ని బాగా ఫాలో అవుతాను. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే కొంచెం చిరాకు వస్తుంది (నవ్వుతూ).
సినిమా ఇండస్ట్రీలో పోటీ, పోలికలు కామన్.,.కానీ ఈ రెండిటికీ దూరం అని చెబుతున్నారు.. ఎలా సాధ్యం ?
నేను ఒకరితో పోల్చుకొను. నాకు ఉన్నదే బోనస్ అనుకుంటా. ఇంకేది ఎక్కువగా అడగను. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. సినిమాల్లోనే కాదు ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు ప్రత్యేకం. ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు.
కొత్త సినిమాలు గురించి ?
సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com