చిరు 150 - బాలయ్య 100 - వెంకీ 75.
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం కోసం రెడీ అవుతుండడం విశేషం. ప్రస్తుతం వెంకీ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బాబు బంగారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాబు బంగారం జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. బాబు...బంగారం వెంకటేష్ కి 73వ చిత్రం. ఈ చిత్రం తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ 74వ చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత వచ్చే సంవత్సరం వెంకీ 75వ చిత్రం చేయనున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే...వెంకీ 75వ చిత్రం కోసం పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పారట. కథ నచ్చడంతో వెంకీ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని పూరికి చెప్పినట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే...వెంకీ 75వ చిత్రానికి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com