సక్సెస్ టూర్ ప్లాన్ లో 'వెంకటాపురం'
Send us your feedback to audioarticles@vaarta.com
రాహుల్, మహిమా మక్‌వానా హీరో హీరోయిన్స్‌గా గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్స్‌పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'వెంకటాపురం`. మే 12న సినిమా విడుదలైన సందర్భంగా శనివారం థాంక్స్ మీట్ జరిగింది.
మా యూనిట్ ఏడాదిన్నర పాటు కష్టపడి పెంచుకున్న బిడ్డనే `వెంకటాపురం` చిత్రం. సినిమాను మే 12న 250 థియేటర్స్‌లో విడుదల చేశాం. అన్నీ థియేటర్స్ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బావుందని సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్నగారు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ రావడానికి టెక్నిషియన్స్ కూడా తమ వంతుగా సపోర్ట్ అందిస్తున్నారు. సినిమా ఉదయం ఆటకు కలెక్షన్స్ 30 శాతం ఉంటే మ్యాట్నీ సమయానికి ఈ కలెక్షన్స్ 60 శాతానికి పెరిగింది. పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో వచ్చాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇంతటి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులను కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నామని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ తెలిపారు.
హ్యాపీడేస్ తర్వాత నాకు చాలా మంచి ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుందని, నా క్యారెక్టర్ బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్, క్యారెక్టర్ కూడి భిన్నంగా ఉంది కదా, అసలు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటరా లేదా అని ఆలోచించాను. కానీ ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూసి చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో నాకు మంచి స్టార్ట్ వచ్చింది. వెంకటాపురం నాకు మంచి కమ్ బ్యాక్ మూవీ అని భావిస్తున్నానని హీరో రాహుల్ తెలిపారు.
సినిమాను కొత్త స్ర్కీన్‌ప్లే విధానంతో తెరకెక్కించాం. అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రాహుల్ క్యారెక్టర్ చాలా డిపరెంట్‌గా ఉందని అంటున్నారని దర్శకుడు వేణు మడికంటి తెలిపారు.
వెంకటాపురం రాహుల్ కెరీర్‌లో పెద్ద కమ్ బ్యాక్ మూవీ. సినిమా బావుందని అందరరూ అంటున్నారు. మనోజ్, సాయిదరమ్ తేజ్, వరుణ్‌తేజ్ వంటి స్టార్స్ కూడా సినిమా బావుందని ట్విట్టర్లో అప్రిసియేట్ చేస్తున్నారని మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments