ఈ ఏప్రిల్ 23న 'వెంకటాపురం' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అచ్చు అందించిన ఆడియోని ఈనెల 23న విడుదల చేస్తున్నారు. చిత్రాన్ని అతిత్వరలో మంచి ధియోటర్స్ లో ప్రేక్షకులని ఈ సమ్మర్ కి థ్రిల్ చేసేవిధంగా విడుదలకి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు, వి.వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసిన సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో సరికొత్త కథనంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెరకెక్కించిన చిత్రం మా వెంకటాపురం. వైజాగ్ నెపధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. చాలా అందంగా పాత్రకు తగ్గట్టుగా ఓదిగిపోయాడు రాహుల్, చిత్రం చూసిన తరువాత రాహుల్ కంటే ఆనంద్ గా అందరి మనసులు గెలుచుకుంటాడు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్రకాష్ కెమెరా వర్క్ హైలెట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. అచ్చు అందించిన ఆడియో ఈనెల 23న విడుదల చేస్తున్నారు. అతిత్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాము. అని అన్నారు
నటీనటులు - రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు - ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూసర్: ఉమాదేవి కునపరాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com