'వెంకటాపురం' పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ `వెంకటాపురం`. హ్యాపీడేస్ ఫేం హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకత్వం వహించాడు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోం మినిష్టర్ నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ సీడీని విడుదల చేశారు. డైరెక్టర్ మారుతి ఆడియో సీడీలను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శర్వానంద్, రాహుల్ రవీంద్రన్, విజయ్ దేవరకొండ, హీరో రాహుల్, మహిమా మక్వాస్, డి.ఎస్.రావు, కాశీ విశ్వనాథ్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్, డార్లింగ్ స్వామి, గురూజీ సాయి, గోవర్ధన్ రెడ్డి, అచ్చు, దీపు, రఘురాం, అభిచంద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
పాటలు బావున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి హండ్రెడ్ డేస్ ఆడాలని కోరుతున్నాను. శ్రీధర్ నన్ను కలవడానికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో మేం భాగస్వాములమని చెప్పారు. సరేనని నేను కూడా ఈ వేడుకకు వచ్చాను. ఇలాగే తెలంగాణ కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వచ్చి తెలంగాణ వాడి, వేడిని చూపించాలి, ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగని ఆంధ్రవారిని దూరం చేసుకోవాలని కాదు, హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే ఆంధ్రవాళ్ళంతా తెలంగాణ వాదులే. ఎవరినీ ఎమనడానికి వీల్లేదు. వారు ఇప్పుడు మన సోదరులు. మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, పక్క పక్కనున్నాం. అందరి కలిసి మెలిసి ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవాలి. కానీ అక్కడి ముఖ్యమంత్రి మనల్నిఅప్పుడప్పుడు కెలుకుతున్నాడు. ఏదేమైనా మనం మాత్రం కలిసుందాం.
తెలంగాణ హీరో, హీరోయిన్స్‌ను బాగా పైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. దర్శకుడు వేణు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చుకి, సినిమాకు అభినందనలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర హోం మినిష్టర్ నాయిని నర్సింహరెడ్డి. హీరో రాహుల్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సిక్స్‌ప్యాక్ చేశాడు. జెన్యూన్ స్క్రిప్ట్. నాకు కథ కూడా తెలుసు. నిర్మాత శ్రీనివాస్ కూడా బాగా తెలుసు. అచ్చు పాటలు, రీరికార్డింగ్ ఎప్పుడూ బావుంటాయి. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తను ఒకడు. తనతో కలిసి ఎప్పటికైనా సినిమా చేస్తాను. నాకు ఇష్టమైన అందరూ కష్టపడి చేసిన సినిమా. హిట్ అయ్యే లక్షణాలు బాగా కనపడుతున్న సినిమా ఇది అని హీరో శర్వానంద్ చెప్పారు.
నేను అల్రెడి సినిమా చూశాను. సినిమా చాలా బావుంది. సినిమా చూసిన కెమెరా మెన్ సాయిప్రకాష్, డైరెక్టర్ వేణుయే అసలు హీరోలుగా అనిపించారు. చాలా సిన్సియర్గా కనపడ్డారు. రాహుల్ కథను నమ్మి చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ను చెక్కారు. సినిమా చూస్తే, సినిమాలో నిజాయితీ కనపడుతుంది. మహిమా మక్వాస్ చాలా ఎఫర్ట్ పెట్టి చేసిందని మారుతి తెలిపారు. రాహుల్, దర్శక నిర్మాతలకు థాంక్స్. మాటల కంటే చేతలే మాట్లాడుతాయి. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాను. మంచి మ్యూజిక్ కుదిరిందని మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అన్నారు. అచ్చుగారు నా మ్యూజిక్‌కు పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకు బెస్ట్ ట్యూన్స్‌తో పాటు అదిరిపోయే రీరికార్డింగ్ ఇచ్చారు. కష్టపడి ఇష్టంతో సినిమా చేశాం. రాహుల్‌గారు ఎంతో సహకారం ఇచ్చారు. మంచి టీం దొరికింది కాబట్టే మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను అని దర్శకుడు వేణు తెలిపారు.
నాది, డైరెక్టర్ వేణు, నిర్మాతలది మూడేళ్ళ ప్రయాణమే ఈ చిత్రం. నిర్మాతలు శ్రీనివాస్, ఫణిగారు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే అయినా, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చాలా ప్యాషన్‌తో సినిమా చేశారు. డైరెక్టర్ వేణు చెప్పిన కథ కంటే సినిమాను బాగా తీశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చినదానికి కారణం కూడా ఆయనే. సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీతో బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. అచ్చు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ఈ సినిమాతో తను పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ట్యూన్స్ కంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మహిమ అద్భుతంగా నటించింది. అజయ్, అజయ్‌ఘోష్, రాథోడ్, శివ సహా అందరూ అద్భుతంగా నటించారు. మధుగారు చక్కటి ఎడిటింగ్ ఇచ్చారు. సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని హీరో రాహుల్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout