సురేష్ గోపీ న్యూలుక్.. ‘మీది గడ్డమా? మాస్కా?’ , రాజ్యసభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ భవితను నిర్దేశించే చట్ట సభల్లో ఇటీవలి కాలంలో వాగ్వాదాలకు, పరస్పర ఆరోపణలకు, ముష్టి యుద్ధాలకు వేదికగా నిలుస్తోంది. అయితే కొన్ని సార్లు మాత్రం అదే సభలో నవ్వుల పువ్వులు విరబూస్తుంటాయి. కొట్టుకునే నేతలే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుని నవ్విస్తూ వుంటారు. తాజాగా పార్లమెంట్లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కేరళ బీజేపీ ఎంపీ, మలయాళ స్టార్ హీరో సురేశ్ గోపీ ఇటీవల బాగా గడ్డం పెంచారు. ఎంతలా అంటే గుబురు గడ్డంలో ఆయనను జనం కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎంపీ హోదాలో ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సురేశ్ గోపీ మాట్లాడేందుకు రెడీ అవుతుండగా.. ఛైర్మన్ సీటులో వున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఓ అనుమానం వచ్చింది.
సురేశ్ గోపీ తెలుపు, బూడిద రంగు గుబురు గడ్డం, నల్లటి మీసాలను చూసి మాస్క్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయనను చూసి వెంటనే ‘మీది గడ్డమా? లేక మాస్కా?’ అని ప్రశ్నించారు. దీంతో సభలో సభ్యులు ఫక్కున నవ్వారు. స్పీకర్ అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపి కూడా మొదట ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత నవ్వుతూ ‘గడ్డమే’ అని సమాధానమిచ్చారు.
తన కొత్త చిత్రం కోసం గడ్డం పెంచుతున్నానని సురేశ్ గోపీ సమాధానమిచ్చారు. సురేశ్ గోపీ సమాధానంతో సంతృప్తి చెందిన వెంకయ్య నాయుడు ‘ఇక ప్రసంగం మొదలుపెట్టండి’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఓ 11 సెకండ్ల వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout