దేశ ప్రజలందరూ గర్వపడే చిత్రం 'ఘాజీ' - వెంకయ్య నాయుడు

  • IndiaGlitz, [Sunday,February 26 2017]

ద‌గ్గుబాటి రానా హీరోగా సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఘాజీ'. 1971..వైజాగ్ స‌ముద్రం లోప‌ల భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన అండ‌ర్ వాట‌ర్ వార్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుద‌ల నుండి అందరి ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ శ‌ర‌వేగంగా దూసుకెళ్తోంది. తెలుగు, త‌మిళం, హిందీ వెర్ష‌న్స్‌లో విడుద‌లైన ఈ సినిమా విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు నుండి మంచి ప్ర‌శంస‌లు అందుకుంటుంది.
ఈరోజు హైద‌రాబాద్‌ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో కేంద్ర‌మంత్రి ఎం.వెంకయ్య‌నాయుడు ప్ర‌త్యేకంగా వీక్షించారు. 1971లో ఇండియా పాక్ మ‌ధ్య జ‌రిగిన‌ అండ‌ర్‌వాట‌ర్ వార్ గురించి తెలియ‌జేసిన చిత్ర‌మిది. దేశ‌భ‌క్తిని స‌రికొత్త‌గా తెలియ‌జేసిన చిత్రం. ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డాల్సిన చిత్ర‌మిది. అవార్డులు, రివార్డులు ఆశించకుండా ఒక మంచి సినిమా చేయాల‌ని ఘాజీ చిత్రాన్ని చేసిన నిర్మాత‌ల ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను. రానా స‌హా నటీన‌టులంద‌రూ ఎంతో అద్భుతంగా న‌టించారని ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌నాయుడు యూనిట్‌ను అభినందించారు.