Vemula Rohit:వేముల రోహిత్ దళితుడు కాదు.. కేసు మూసివేసిన పోలీసులు..

  • IndiaGlitz, [Friday,May 03 2024]

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని స్పష్టంచేశారు. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఉపశమనం లభించింది.

కాగా 2016లో హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దళితుడైన రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ రోజుల తరబడి నిరసనలు జరిగాయి. దీంతో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను సైతం పోలీసులు జోడించారు. అయితే తాజాగా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

ఇక పోలీసులు తాజా రిపోర్టుపై వేముల రోహిత్ సోదరుడు రాజా స్పందించారు. పోలీసుల వాదన అసంబద్దమైనదని.. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో కూడా అర్థం కావడంలేదని వాపోయారు. రేపు(శనివారం) సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని తమ కుటుంబం భావిస్తోందని తెలిపారు. కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని.. 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని విమర్శించారు.

More News

BRS:బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

తెలంగాణ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో

Rahul Gandhi:రాయ్‌బరేలీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు

Telangana Congress;లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో టీ కాంగ్రెస్ రూపొందించింది.

Mudragada Daughter:ముద్రగడకు ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. పవన్ కల్యాణ్‌కు మద్దతు..

ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానం పిఠాపురం.

Avinash Reddy:వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట

ఏపీ ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ