యూ ట్యూబ్‌ను షేక్ చేసిన  ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’!

  • IndiaGlitz, [Saturday,November 02 2019]

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేశ్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదండోయ్.. కొందరైతే ఈ పాటకోసం సినిమాకెళ్లారంటే అర్థంచేస్కోండి. సినిమా రిలీజ్‌కు వన్ మినిట్ సాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. తాజాగా పూర్తి పాటను విడుదల చేసింది. రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే యూ ట్యూబ్‌ను షేక్ చేసింది. ఒకే ఒక్కరోజులోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

కాగా.. గతంలో శోభన్ బాబు -శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమా నుంచి ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ సాంగ్‌ను గద్దలకొండ గణేష్ సినిమాలో రీమేక్ చేశారు. అయితే.. అప్పట్లో ఈ పాటను చక్రవర్తి స్వరపరచారు. అప్పటికీ ఇప్పటికీ ఈ సాంగ్‌ ఎవర్‌గ్రీనే. ఒక్క మాటలో చెప్పాలంటే అందాల శోభన్ బాబు కెరియర్లోనే హిట్ సాంగ్‌గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్‌ రీమేక్ చేయగా.. పాత సాంగ్ రేంజ్‌ను చేరుకోలేదు కానీ.. చిత్రబృందం ఆశించిన స్థాయికైతే వెళ్లింది. కాగా.. పూజా హెగ్డేను గ్లామరస్‌గా ఉండటం.. ఆ అందాన్ని హరీశ్ శంకర్ క్యాచ్ చేసి చూపించడంతో కుర్రకారు ఈ వీడియో సాంగ్‌ను చూడటానికి ఇష్టపడుతున్నారని.. అందుకే ఇన్ని వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. అయితే మున్ముంథు ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ ఎన్నెన్ని రికార్డ్‌లు సొంతం చేసుకుందో వేచి చూడాలి మరి.

More News

పవన్‌ ఓటమికి అసలు కారణం చెప్పిన మంత్రి అనిల్!

ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో

లాంగ్ మార్చ్‌పై అసత్యపు ప్రచారాలు నమ్మొద్దు: పవన్

భవన నిర్మాణ కార్మికులకు అండగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభం

పాట కోసం ఐదు కోట్ల రూపాయలా?

ఈ మధ్య సినిమాలో భాగమైన భారీ సెట్స్‌కు భారీగా ఖర్చు పెడుతున్నారంటేనే అబ్బో అని అనుకునేవాళ్లం.

రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఏంటంటే?

ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారో లేదో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ చిత్రాన్ని వెంటనే ప్రకటించారు.

ముగ్గురూ అందుకు ఒప్పుకుంటారా?

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న వారిలో ఖాన్‌ త్రయం ఎప్పుడూ ముందుంటుంది. ఈ ముగ్గురూ ముగ్గురే.