వీరు పోట్ల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి..డైరెక్టర్ అయిన వాళ్లలో వీరు పోట్ల ఒకరు. బిందాస్ సినిమాతో డైరెక్టర్ అయిన వీరు పోట్ల...ఆతర్వాత నాగార్జునతో రగడ, మంచు విష్ణుతో దూసుకెళ్తా చిత్రాన్ని తెరకెక్కించాడు. బిందాస్,రగడ, దూసుకెళ్తా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన వీరు పొట్ల తాజాగా సునీల్ తో సినిమా చేయనున్నట్టు సమాచారం.
ఇటీవల సునీల్ కి కథ చెప్పడం, కథ విని సునీల్ ఓకె చెప్పడం జరిగిందట. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. సునీల్, వీరు పోట్ల కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నట్టు సమాచారం. మరి..సునీల్ ని వీరు పోట్ల ఎలా చూపిస్తాడో..?ఎలాంటి కథాంశంతో సినిమా తీస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments