26న వస్తున్న వీరి వీరి గుమ్మడి పండు..
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన నటీనటులు రుద్ర, వెన్నెల జంటగా నూతన దర్శకుడు సాగర్ తెరకెక్కించిన చిత్రం వీరి వీరి గుమ్మడి పండు. ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 26న వీరి వీరి గుమ్మడి పండు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరి వీరి గుమ్మడి పండు చిత్ర దర్శకుడు సాగర్ మాట్లాడుతూ...ఇది ఓ డిఫరెంట్ ఫ్యామిలీ హర్రర్ మూవీ. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది.
ఒక ఇంట్లో దెయ్యం ఉందని తెలిసిన తర్వాత అసలు దెయ్యం ఎవరిలో ఉందనేది చాలా ఇంట్రస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. 2013లో ప్రేమ కథా చిత్రమ్, 2014లో గీతాంజలి 2015లో రాజు గారి గది ఎంతటి విజయాన్ని సాధించాయో...2016 లో మా చిత్రం వీరి వీరి గుమ్మడి పండు ఆ సినిమాల స్ధాయిలో విజయం సాధిస్తుందని నమ్మకం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com