Veera Simha Reddy: డిసెంబర్ 15న 'వీరసింహారెడ్డి' 'సుగుణ సుందరి' లిరికల్ వీడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'లో పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి.
బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా...ఈ నెల 15న విడుదల కానున్న 'సుగుణ సుందరి' రెండో సింగిల్ లో లీడ్ పెయిర్ కనిపించనుంది. బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్ గా ఉంది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట 'జై బాలయ్య' మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com