Veerasimha Reddy: 'వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ 'జై బాలయ్య' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'లో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో కనిపించనున్నారు. గోప్చంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. థియేటర్లలో అభిమానులకు గూస్బంప్స్ని అందించేంత అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ జై బాలయ్యతో మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు.
బాలకృష్ణ అభిమానులకు నినాదమైన జై బాలయ్య ను ఫ్యాన్స్ కోసం అదిరిపోయే మాస్ సాంగ్ గా కంపోజ్ చేసారు సంగీత దర్శకుడు థమన్. సూపర్ ఫామ్ లో థమన్ బాలకృష్ణ స్వాగ్, మాస్ స్టెప్స్ తగినట్లు ఈ పాటని అద్భుతంగా స్కోర్ చేశారు.
కరీముల్లా తన ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకోగా తమన్ మైండ్ బ్లోయింగ్ స్కోర్ పాటని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం హీరో పాత్ర ఔనత్యాన్ని తెలియజేసేలా వుంది. బాలకృష్ణ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ పాట చాలా కాలం పాటు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. బాలకృష్ణ అభిమానులు బిగ్ స్క్రీన్లపై వీడియో సాంగ్ ని చూడటానికి ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments