వర్మ పై వీరప్పన్ భార్య ఎటాక్..

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత క‌థ ఆధారంగా సినిమా తీసిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో వీర‌ప్ప‌న్ చిత్రాన్ని తీసారు. ఆత‌ర్వాత హిందీలో తీసారు. హిందీలో తీసిన వీర‌ప్ప‌న్ చిత్రాన్ని ఇప్పుడు త‌మిళ్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మి చూసింది అనుకుంట‌...వీర‌ప్ప‌న్ గురించి నా ద‌గ్గ‌ర అన్ని విష‌యాలు సేక‌రించి సినిమాని మాత్రం త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తీసాడు అంటూ వ‌ర్మ పై ఫైర్ అవుతుంది వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మి. వీర‌ప్ప‌న్ గురించి నాకు తెలిసినంతగా ఎవ‌రికీ తెలియ‌దు.
ఈ సినిమాలో అన్ని అస‌త్యాలే ఉన్నాయి. త‌మిళ ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని చూడ‌వద్దు అంటూ పిలుపు ఇచ్చారు. ఈ చిత్రాన్ని హిందీలో మాత్రమే తీస్తాన‌ని చెప్పి ఇప్పుడు వ‌ర్మ మాట మార్చి మిగిలిన భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాడు. అస‌లు...స‌త్యాల‌ను కాకుండా అస‌త్యాల‌ను ఈ చిత్రంలో చూపిస్తూ ఎలా సినిమా తీసాడు అంటూ ముత్తుల‌క్ష్మి వ‌ర్మ‌ని ప్ర‌శ్నిస్తుంది. మ‌రి..ముత్తుల‌క్ష్మి ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ‌ స‌మాధానం చెబుతాడో లేడో చూడాలి.