ఈ నెల 27న వ‌స్తున్న బాలీవుడ్ మూవీ వీర‌ప్ప‌న్

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కించిన కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాన్ని బాలీవుడ్ లో వీర‌ప్ప‌న్ అనే టైటిల్ తో రీమేక్ చేసారు. ఈ చిత్రంలో సందీప్ భ‌ర‌ద్వాజ్, ఉష‌, లీసా రే, స‌చిన్ జోషి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ...1990 ఆ టైమ్ లో వీర‌ప్ప‌న్ గురించి తెలుసుకున్నాను. వీర‌ప్ప‌న్ అడ‌విలో ఉంటూనే చ‌రిత్ర సృష్టించాడు. 97 మంది పోలీసుల‌ను, 900 ఏనుగులును వీర‌ప్ప‌న్ చంపాడు. వీర‌ప్ప‌న్ ప‌ట్ట‌కోవ‌డం కోసం ప్ర‌భుత్వం 734 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. ఇలా ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. వీర‌ప్ప‌న్ తో ప‌నిచేసి జైలుకి వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తుల‌ను క‌లిసి వీర‌ప్ప‌న్ గురించి తెలుసుకున్నాను. క‌న్న‌డ‌లో తీసిన కిల్లింగ్ వీర‌ప్ప‌న్ లో రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేయ‌డం ఆత‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు చూపించాను. ఇందులో అస‌లు వీర‌ప్ప‌న్ అనేవాడు ఎలా పుట్టాడ‌నే విష‌యం నుండి చ‌నిపోయేవ‌ర‌కు చూపిస్తున్నాను. నేను చెప్పేది అంతా నిజ‌మే అని యాద‌గిరి న‌ర‌సింహ‌స్వామి పై ప్ర‌మాణం చేసి చెబుతున్నాను అన్నారు.

లిసారే మాట్లాడుతూ... నేను ఈ చిత్రంలో గ్లామ‌ర్ రోల్ చేయ‌లేదు. ధైర్యం ఉన్న‌ ప్రియ అనే పాత్ర పోషించాను. ఈ సినిమాలో న‌టించ‌డం అద్భుత అవ‌కాశంగా భావిస్తున్నాను. ఛాలెంజ్ గా తీసుకుని ఈ పాత్ర పోషించాను. రాము గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించడం ఆనందంగా ఉంది. నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ మంచి పాత్ర ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను. అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సందీప్ భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ...వీర‌ప్ప‌న్ ఎలా ఉంటాడో...ఎలా న‌డుస్తాడో..త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకుందాం అంటే ఎక్క‌డా స‌మాచారం దొర‌క‌లేదు. అందుచేత రామ్ గోపాల్ వ‌ర్మ గారు ఏం చెబితే అది చేసాను. తెలుగు, క‌న్న‌డ తో పాటు బాలీవుడ్ రీమేక్ లో కూడా న‌టించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.

ఉష మాట్లాడుతూ...ఈ చిత్రంలో వీర‌ప్ప‌న్ భార్య ముత్తు ల‌క్ష్మి పాత్ర పోషించాను. సందీప్, స‌చిన్, వ‌ర్మ గారితో వ‌ర్క్ చేయ‌డం గ్రేట్ ఎక్స్ పీరియ‌న్స్. ఈ సినిమా ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది అన్నారు.

స‌చిన్ జోషి మాట్లాడుతూ...వీర‌ప్ప‌న్ గురించి తెలుసుకునేందుకు వ‌ర్మ గారు చాలా రీసెర్చ్ చేసారు. వీర‌ప్ప‌న్ గురించి ఉత్త‌రాది ప్ర‌జ‌ల‌కు పూర్తిగా తెలియ‌దు అందుచేత వీర‌ప్ప‌న్ పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయే వ‌ర‌కు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. వీర‌ప్ప‌న్ ప‌ట్టుకోవ‌డం కోసం గ‌వ‌ర్న‌మెంట్ 20 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌య‌త్నించింది. వీర‌ప్ప‌న్ గురించి చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇందులో చూపిస్తున్నాం. మంచి చిత్రాల‌ను ఆడియోన్స్ ఆద‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.