వీరప్పన్ మూవీ తీయడానికి కారణం ఇదే..
Wednesday, May 25, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వీరప్పన్. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని బాలీవుడ్ లో వీరప్పన్ టైటిల్ తో మరియు కొన్ని మార్పులుతో రీమేక్ చేసారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ...వీరప్పన్ లాంటి క్రిమినల్స్ గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వీళ్లను ఎలా అంతం చేయాలో తెలిసినప్పుడు సమాజంలో ప్రగతి సాధ్యమవుతుంది. ఈ సినిమా తీయడానికి కారణం..క్రిమినల్స్ ను గొప్పగా చూపించడం కోసం కాదు...అతడు ఆ స్ధాయికి ఎలా వచ్చాడో తెలియచేసే ప్రయత్నం మాత్రమే అంటున్నారు. సినిమా తీయడం నా ఇష్టం..చూస్తారో లేదో అనేది మీ ఇష్టం అనే వర్మ...ఇప్పుడు వీరప్పన్ సినిమా తీయడానికి కారణం అంటూ వివరణ ఇవ్వడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments