సినీ రంగ ప్రవేశం చేసిన వీరప్పన్ కుమార్తె..

  • IndiaGlitz, [Saturday,April 03 2021]

ఎర్ర చందనం స్మగ్లర్‌ వీరప్పన్‌.. చనిపోయి ఏడేళ్లవుతున్నా ఆయనను మాత్రం ఎవరూ మరచిపోలేరు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించాడు. ఈయనను పట్టుకునేందుకు కొన్నేళ్లపాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరకు 2004లో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఈ ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ చనిపోయాడు. ఈయన జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఆయన మరణానంతరం ఆయన పిల్లలు వెలుగులోకి వచ్చారు. వీరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు.

పెద్ద కుమార్తె విద్యారాణి ఇటీవలే బీజేపీలో చేరింది. కాగా.. రెండో కుమార్తె విజయలక్ష్మి తాజాగా సినీ రంగ ప్రవేశం చేసింది. విజయలక్ష్మి టైటిల్ రోల్ చేస్తున్న సినిమాను కేఎన్‌ఆర్‌ రాజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'మావీరన్‌ పిళ్లై' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ శుక్రవారం విడుదలైంది. ఇందులో విజయలక్ష్మి తన తండ్రిని గుర్తు చేసింది. వీరప్పన్‌ స్టైల్లో తుపాకీని భుజాన వేసుకుని నిలబడింది. ఈ చిత్రం వీరప్పన్‌ మరణం తర్వాత కొనసాగింపుగా ఉంటుందేమోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరి విజయలక్ష్మికి ప్రేక్షకుల నుంచి ఏమేరకు ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

More News

మరోసారి ప్రభుత్వంపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు.

ఉబర్‌కు షాక్.. రూ.8 కోట్ల జరిమానా

ఉబర్‌కు భారీ షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

'వివాహ భోజనంబు'లో రెండో పాట 'వాట్ ఏ మ్యాన్...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.

పవన్ యాక్షన్‌లోకి దిగాడు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ 15 సినిమాలు..

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే బీభత్సమైన టాలెంట్‌తో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి.