సినీ రంగ ప్రవేశం చేసిన వీరప్పన్ కుమార్తె..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్.. చనిపోయి ఏడేళ్లవుతున్నా ఆయనను మాత్రం ఎవరూ మరచిపోలేరు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించాడు. ఈయనను పట్టుకునేందుకు కొన్నేళ్లపాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరకు 2004లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఈ ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ చనిపోయాడు. ఈయన జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఆయన మరణానంతరం ఆయన పిల్లలు వెలుగులోకి వచ్చారు. వీరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు.
పెద్ద కుమార్తె విద్యారాణి ఇటీవలే బీజేపీలో చేరింది. కాగా.. రెండో కుమార్తె విజయలక్ష్మి తాజాగా సినీ రంగ ప్రవేశం చేసింది. విజయలక్ష్మి టైటిల్ రోల్ చేస్తున్న సినిమాను కేఎన్‌ఆర్ రాజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'మావీరన్ పిళ్లై' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదలైంది. ఇందులో విజయలక్ష్మి తన తండ్రిని గుర్తు చేసింది. వీరప్పన్ స్టైల్లో తుపాకీని భుజాన వేసుకుని నిలబడింది. ఈ చిత్రం వీరప్పన్ మరణం తర్వాత కొనసాగింపుగా ఉంటుందేమోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరి విజయలక్ష్మికి ప్రేక్షకుల నుంచి ఏమేరకు ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com