'వీర భోగ వసంత రాయలు' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కల్ట్ మూవీగా.. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియా శరన్ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన చిత్రం `వీర భోగ వసంత రాయులు`. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే నారా రోహిత్, శ్రియా, సుధీర్ బాబు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ అనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా నారా రోహిత్, శ్రియా తీవ్ర వాదులను పట్టుకునే రేంజ్ ఆఫీసర్స్‌గా కనపడితే .. ఓ పిల్లవాడు ఇల్లు పోయిందని కంప్లైంట్ ఇస్తే.. దానిపై పరశోధన చేసే పోలీస్‌గా సుధీర్ కనపడుతున్నారు.
ఇక శ్రీ విష్ణు పాత్ర ఎక్కడా రివీల్ చేయలేదు. చిన్న ఆడపిల్లలను కిడ్నాప్ చేయడం, టెర్రరిజం అనే మెయిన్ కాన్సెప్ట్స్ చుట్టూనే దర్శకుడు ఇంద్ర ఈ కథను అల్లుకున్నట్లు.. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ అని అర్థమవుతుంది. అక్టోబర్ 26న విడుదల కాబోతున్న ఈ సినిమాపై యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర చాలా కీలకంగా కనపడనుందనేది సమాచారం. రాబిన్స్ నేపథ్య సంగీతం చాలా కీలకం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments